Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలంగా మారుతుంది. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ సెలవు ప్రకటించారు.

New Update
ap rains

Vizag: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలంగా మారుతుంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు మరింత తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురవనున్నాయని  విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. 

Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 390 కిలోమీటర్లు.. విశాఖకు  430 కిలోమీటర్ల దూరంలో నెమ్మదిగా కదులుతున్నట్టు ఐఎండీ ప్రకటించింది. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతుఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!

 దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి..మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది.

Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్మేశాయి. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ సెలవు ప్రకటించారు.

Also Read: Ap: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!

 వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు