Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పాయి కంపెనీలు.11 కంపెనీల వరకు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. తగ్గించిన ధరలతో మందుబాబులకే పండగే అని చెప్పాలి. అంతేకాదు ఇటీవల కొన్ని కంపెనీలు కూడా మద్యం షాపుల్ని తగ్గించిన సంగతి తెలిసిందే.

New Update
liquor

AP: ఏపీలో మందుబాబులకు పండగ చేసుకునే విషయమిది. మద్యం ధరలు భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో భారీగా ధరలు తగ్గుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సుమారు 11 మద్యం తయారీ కంపెనీలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ 11 కంపెనీలు వాటి బేసిక్‌ ప్రైస్‌ను భారీగా తగ్గించాయి. ఈ మేరకు రాష్ట్ర బెవరేజస్‌ సంస్థ ఆ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గింది. 

Also Read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!

ఈ తగ్గించిన ధరలతో ఆ బ్రాండ్లను బట్టి.. ఒక్కో క్వార్టర్‌ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గనుంది. ఈ మేరకు మద్యం కొనుగోలు చేసేవారికి ఇక పండగే.గత ప్రభుత్వ హయాంలో మద్యం బేసిక్ ప్రైస్‌ను భారీగా పెంచేశాయనే వాదనలు ఉన్నాయి. ఈ మేరకు ప్రస్తుతం మద్యం సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే బేసిక్ ప్రైస్‌ను తగ్గించాయి.

Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

గత ప్రభుత్వ హయాంలోలో ఆ కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి.. కొన్ని ఫిర్యాదులు కూడా అందాయంటున్నారు. అందుకే ఆ కంపెనీలు బేస్ ప్రైస్‌ను భారీగా పెంచేశారన్న ఫిర్యాదులు వచ్చాయట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే వినియోగదారుల డిమాండుకు తగ్గట్లు ఆర్డర్లు వస్తుండటంతో 11 కంపెనీలు బేసిక్ ప్రైస్‌ను భారీగా తగ్గించాయి.. ఈ మేరకు మద్యం ఎమ్మార్పీపై భారీగా తగ్గుతోంది.

Also Read: Ap: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!

మరోవైపు మద్యానికి సంబంధించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఎమ్మార్పీ కంటే రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ఊరుకునేది లేదన్నారు. ఎమ్మార్పీ ధరలు పెంచినా, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించినా.. ఆ షాపులకు మొదటి తప్పు కింద రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 

Also Read: Health Tips: రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తినాలి?..ప్రయోజనమేంటి?

రెండోసారి అదే తప్పు చేస్తే షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మద్యం షాపులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి షాపు దగ్గర కచ్చితంగా సీసీ కెమెరాలతో పాటుగా ధరల వివరాల్ని తెలుపుతూ బోర్డులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు