ఇదేం వికృతానందం
ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో హీరోలు అయిపోదామని యువకులు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి అవి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. బైక్, కారు రెండిటిమీద కాళ్లు పెట్టి ఒక యువకుడు చేసిన దుస్సాహసం.. అతన్ని ప్రమాదం బారిన పడేసింది.
హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి వివిధ రకాల బైక్స్ పై విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యువతి వరంగల్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా స్టాంట్స్ చేస్తూ చక్కర్లు కొడుతుంది.
పేరు తెచ్చిన స్టంట్సే చివరకు ప్రాణాలు తీశాయి. కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అర్ధరాత్రి బైక్ మీద స్టంట్స్ చేస్తుండగా అతి వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. చాదర్ఘాట్ పీఎస్ పరిధిలోని సవేరా హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.