Bride and Groom  : ఇప్పుడే ఇలా ఉంటే మీరు కలిసి కాపురం ఎలా చేస్తార్రా... పెళ్లి వేదిక మీదే వధూవరుల ఫైటింగ్‌

ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది.  వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
Bride and Groom

Bride and Groom Viral Video

Bride and Groom  : పెళ్లి అనేది రెండు జీవితాలను ముడివేసే బందం. ఒక మరిచిపోలేని మధుర ఘట్టం. అలాంటి వేదిక బంధుమిత్రుల సంతోషంతో అందరిని మెప్పించేలా ఉండాలి. కానీ ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది.  వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంట ఇక కలిసి కాపురం చేసినట్టే అంటూ జోకులు పేలుస్తున్నారు.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. @gharkekalesh అనే ట్విటర్(ఎక్స్‌) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. అక్కడ ఓ వివాహ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివాహ వేదికపై వధూవరులిద్దరూ ఉన్నారు. ఇద్దరూ కలిసి వెడ్డింగ్ కేక్ కట్ చేశారు. ముందుగా వధువు కేకు ముక్కను వరుడికి తినిపించింది. అతను సంతోషంగా తిన్నాడు. అనంతరం వరుడు ఆ కేకును వధువుకు తినిపించే ప్రయత్నం చేశాడు. కానీ,  ఆమె తినడానికి నిరాకరించింది. వరుడికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ ముందు చిన్నతనం అనుకున్నాడేమో..ఆ కేకు ముక్కను కింద పడేశాడు. అంతటితో ఆగకుండా టేబుల్ మీద ఉన్న కేక్‌ను కాలితో తన్నేశాడు. ఆ తర్వాత కిందకు దిగిపోయాడు. ఈ ఘటన చూసిన వారంతా షాక్‌ తిన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతోంది. దాన్ని ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. 2.8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు