EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

ఈపీఎఫ్‌ఓ ఆటో-సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా క్లెయిమ్ చేసుకున్న 10 రోజులకు ఇప్పటి వరకు వచ్చేది. కానీ ఈ ఆటో సెటిల్‌మెంట్ వల్ల 3 నుంచి 4 రోజుల్లో డబ్బులు వస్తాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

New Update
EPFO

ఈపీఎఫ్‌ఓ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులను ముందుగా తీసుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ పరిమితిని ఈపీఎఫ్‌ఓ పెంచింది. ఇప్పటివరకు లక్ష రూపాయలు ఉన్న ఈ పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. దీనివల్ల క్లెయిమ్‌లు తొందరగా అవుతాయి. దీంతో దాదాపు 7.5 కోట్ల EPFO సభ్యులకు లబ్ది చేకూరనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

అత్యవసర పరిస్థితుల్లో..

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం అప్లై చేసుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. కరోనా సమయంలో క్లెయిమ్ ప్రక్రియ తొందరగా కావడానికి ఈపీఎఫ్ఓ ఫస్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ ఆటో సెటిలిమెంట్ వల్ల మానవ ప్రమేయం లేకుండానే ఐటీ వ్యవస్థ ద్వారా క్లెయిమ్‌లను పరిశీలించి, ఆమోదిస్తారు. విద్య, వైద్య, వివాహం వంటి సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా క్లెయిమ్ 10 రోజులకు వస్తే ఈ ఆటో సెటిలిమెంట్ వల్ల 3 నుంచి 4 రోజుల్లో వస్తాయి. 

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

ఈపీఎఫ్‌ఓ సభ్యులు కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం వీటిని తీసుకొవచ్చు. నిర్దిష్టంగా అయితే ఏం లేదు. ఆరు నెలలు ఉద్యోగం చేసిన తర్వాత దానికి డీఏ కలిపి మొత్తం తీసుకోవచ్చు. అయితే దీన్ని వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు పెళ్లి, చదువు, పిల్లలు ఇలా వాటి కోసం కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. అయితే వాళ్లు ఈపీఎఫ్‌లో సభ్యత్వం పొంది కనీసం ఏడేళ్లు అయితేనే విత్ డ్రా చేసుకోవాలి.

ఇది కూడా గరిష్టంగా మూడు సార్లు పీఎఫ్ అకౌంట్‌ నుంచి 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తప్పకుండా పెళ్లి డిక్లరేషన్, విద్య కోసం అయితే తప్పకుండా పత్రాలు ఉండాలి. వీటితో పాటు ఇంటికి తీసుకోవాలంటే తప్పకుండా ఐదేళ్లు పూర్తి అయి ఉండాలి. ఇంటి నిర్మాణం కోసం ఏడాదికి రెండుసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ డబ్బులను ఫారం 31 ద్వారా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు