HYD Crime News: ఉరేసుకున్న మహిళ.. తలుపులు బద్దలు కొట్టి కాపాడిన పోలీసులు

హైదరాబాద్‌ బాలాపూర్‌లో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వివాహిత మహిళలను ఇద్దరు కానిస్టేబుల్స్ కాపాడారు. పోలీస్ స్టేషన్‌కి కాల్ వచ్చిన వెంటనే వారు అక్కడికి చేరుకుని కర్రతో తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులు ఆమెను కాపాడి.. ధైర్యం చెప్పారు.

New Update
viral Video

viral Video Photograph: (viral Video)

HYD Crime News: ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహిత మహిళను ఇద్దరు పోలీసులు కాపాడారు. ఒక మహిళ ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్(Balapur Police Station) పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరుణ్(Tarun), రాజు(Raju) అనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుళ్ల(Police Conistables)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇది కూడా చూడండి: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?

కాల్ వచ్చిన వెంటనే పోలీసులు..

రోజులాగే గురువారం విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో బాలాపూర్ గ్రామంలో వివాహిత మహిళ ఆత్మహత్మకు పాల్పడుతుందని కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. తలుపులు వేసుకుని లోపల ఉన్న ఆ మహిళను పెద్ద కర్ర సాయంతో బద్దలు కొట్టారు. ఆ వివాహిత అప్పటికే చీరతో మెడకు ఉరివేసుకోవడంతో చీరను కోసి ఆమెను రక్షించారు. 

ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే

సమస్యను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి వచ్చారు. కానిస్టేబుళ్లు చేసిన ఈ పనికి నెట్టింట ప్రశంసలు అందుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే స్పందించి ఆమెను కాపాడి శభాష్ అనిపించుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు