/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
Supreme Court: చట్టబద్ధంగా మొదటి వివాహం రద్దుకాకముందే రెండో పెళ్లి చేసుకున్న మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్.ఉషారాణి వర్సెస్ మూడుదుల శ్రీనివాస్ కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Also Read: interpoll: అమెరికా నుంచి వచ్చిన వలసదారుల్లో ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు!
కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉషారాణి అనే మహిళకు 1999లో నోముల శ్రీనివాస్ అనే వ్యక్తితో ముందు ఓ వివాహం జరిగింది. అనంతరం విబేధాలతో ఈ జంట 2005లో విడిపోయింది. పరస్పర అంగీకారంతో చట్టబద్దంగా వివాహం రద్దు చేసుకోవాలని అనుకున్నారు. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత 2006లో ఆమె మూడుదుల శ్రీనివాస్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోగా.. 2008లో వారికి ఓ బిడ్డ కూడా పుట్టింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి.
Also Read: Ratan Tata: రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి.. ఆ సంచలన వ్యక్తి ఎవరంటే?
ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో . శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులపై గృహహింస కేసు పెట్టింది. తన బిడ్డతో కలిసి రెండో భర్త ఇంటి నుంచి వచ్చేసిన ఆమె.. విడాకులకు అప్లై చేసింది. 2012లో మెయింటెనెన్స్ కోసం హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉషారాణి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమె నెలకు రూ.3,500, బిడ్డకు రూ.5,000 భరణం చెల్లించాలని మూడుదుల శ్రీనివాస్‌ను ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన అతడు.. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకానందున ఆమెకు తాను భరణం చెల్లించాల్సిన అవసరంలేదని ఎదురు తిరిగాడు. అతడి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేవలం బిడ్డకు మాత్రమే భరణాన్ని ఇవ్వాలని చెప్పింది. ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అందుకు మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకాకపోవడమే దీనికి కారణమని హైకోర్టు చెప్పింది.
సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఉషారాణి సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అన్ని విషయాలను పరిశీలించి కుటుంబ కోర్టు తీర్పును సమర్థించింది. ‘‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్‌కు ఉన్న సామాజిక న్యాయం ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మహిళకు భరణాన్ని తిరస్కరించడానికి మా మనసు అంగీకరించ లేదు. ఆమె గురించి ముందే తెలిసిన ప్రతివాది.. పెళ్లి చేసుకొని ఆమె పై అధికారులు పొందాడు.
బాధ్యతలకు వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. రద్దైన రెండు వివాహాల నుంచి ఆమె మెయింటెనెన్స్ కోరి ఉంటే తప్పించుకోడానికి అవకాశం ఉండేది.. పోషణ ఆమెకు కల్పించే లబ్ధి కాదు.. చట్టబద్ధ నైతికహక్కు. ఫ్యామిలీ కోర్టు 2012లో ఆమెకు ప్రకటించిన మెయింటెనెన్స్‌ను పునరుద్ధరిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది.
Also Read:America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!