ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!

ఢిల్లీని ఓ గ్రెేటెడ్ కమ్యూనిటీ మొత్తం వినూత్న పద్ధతిలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాకి వెళ్లిన కుటుంబం త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చి గ్రేెటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో కలపగా వారంతా పవిత్ర స్నానం ఆచరించారు.

New Update
Viral Video delhi

Viral Video delhi Photograph: (Viral Video delhi)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో పూర్తి కావస్తుంది. చాలా మంది పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్లలేకపోయారు. దీంతో కొందరు డిజిటల్ స్నానాలు చేయడం లేదా ఇతరులు తీసుకొచ్చిన నీటిని చల్లుకోవడం వంటివి చేస్తున్నారు. ఇతరులు తీసుకొచ్చినా మహా అయితే ఒక బాటిల్ లేదా రెండు తీసుకొస్తారు. ఇవి కొంత మందికి మాత్రమే సరిపోతాయి. కానీ ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ మొత్తానికి సరిపోవు. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది.

ఇది కూడా చూడండి:National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించాలని..

ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించాలని త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చారు. వీటిని గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కలిపారు. వీటిని నీటిలో కలిపే ముందు హర హర మహదేవా అంటూ పూజలు నిర్వహించి స్విమ్మింగ్ పూల్‌లో రెండు బాటిళ్ల నీరు వేశారు. ఆ తర్వాత గ్రేటెడ్ కమ్యూనిటీకి చెందిన వారంతా ఆ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐడియా బాగుందని, కొన్ని కారణాల వల్ల కుంభమేళాకు వెళ్లలేని వారికి ఇది బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

ఇది కూడా చూడండి:AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు