CONSITABLE ATTACK : విధుల్లో ఉన్న హోంగార్డుపై ఫూల్‌గా మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మాచర్ల పట్టణంలో ఈనెల 25న రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రిస్మస్ పండగ రోజున ఏపీఎస్పీ కానిస్టేబుల్ మల్లికార్జునరావు ఫూల్‌గా మద్యం తాగి రోడ్డుపై ఉన్నాడు. ఆ సమయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన హోంగార్డు శ్రీనివాసరావు కానిస్టేబుల్‌ను చూశారు. Also Read : మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ తాగిన మత్తులో.. మద్యం మత్తులో హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పల్నాడు - మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున… pic.twitter.com/tU4UdSndxL — Aadhan Telugu (@AadhanTelugu) December 28, 2024 Also Read : తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్! అతనిని ఇక్కడికెందుకు వచ్చారని అడిగారు. దీంతో ఆగ్రహానికిలోనై కానిస్టేబుల్ లాఠీతో హోంగార్డుపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవటంతో వారిపై దుర్భాషలాడుతూ వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పట్టణ సీఐ ప్రభాకరరావు మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఇప్పటికే వివరణలు తీసుకున్నారు. తర్వలోనే ఈ ఘటనపై ఓ నివేదికలను ఉన్నతాధికారులకు పంపించామని సీ సీఐ ప్రభాకరరావు వెల్లడించారు Also Read : BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్ గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్ సూసైడ్ లెటర్