Game Changer Viral Letter: రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ సరిగా రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్ చేసుకుంటానంటూ లేఖ విడుదల చేశాడు. అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవడం లేదని.. లెటర్‌పై రిప్ లెటర్ అని రాసి.. గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్.. చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా... సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది.. మీరు ఏ విధమైన ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వడం లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవడం లేదు. A Fan of #RamCharan wrote a suci**de letter regarding Trailer Update 🤯😳#GameChanger pic.twitter.com/omxSWYaSgd — Filmyscoops (@Filmyscoopss) December 28, 2024 ఈ నెల ఆఖరుకల్లా మీరు ట్రైలర్‌లో అప్‌డేట్ ఇవ్వకపోతే న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేస్తున్నాను.. ఇట్లు మీ విధేయుడు.. చరణనన్న భక్తుడు ఈశ్వర్ అంటూ లేఖ రాశాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: రేయ్ ఎవర్రా మీరంతా.. 250 కి.మీ రైలు కింద ప్రయాణం