Alcohol: మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది.

New Update
alcohol

alcohol Photograph

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధం అవుతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు డిసెంబర్ 31న మందుబాబులు మందేసి చిందేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు  తెలంగాణ రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా  జరుగుతున్నాయి.

Also Read :  ఏపీలో దారుణం.. నోరు మూసి... పొదల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై

అర్థరాత్రి 12 గంటల వరకు పర్మిషన్

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రాష్ట్రంలోని వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా  కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు  కాంగ్రెస్‌ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలంటూ ఫ్యాన్‌ సూసైడ్‌ లెటర్‌

అయితే.. ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా ఆంక్షలు మాత్రం విధించారు. GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై ఎక్కువ నిఘా పెంట్టాలని పోలీసులకు సూచించారు. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సాగరతీరాన సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Also Read :  Swiggy Report 2024: హైదరాబాద్ వాసులు ఆటగాళ్లే.. బిస్కెట్స్‌లా కొనేసిన కండోమ్ ప్యాకెట్స్, లక్షల్లో ఆర్డర్స్..!

Advertisment
తాజా కథనాలు