Pakistan vs New Zealand :  తొలి సూపర్-8 మ్యాచ్‌ రద్దు.. కివీస్-పాక్‌కు చెరో పాయింట్

శ్రీలంకలోని కొలంబో వేదికగా శనివారం జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరం వర్షం ధాటికి తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఈ కీలక పోరులో ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయ్యింది.

New Update
pak

శ్రీలంకలోని కొలంబో వేదికగా శనివారం జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరం వర్షం ధాటికి తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఈ కీలక పోరులో ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా బ్యాటింగ్ ఎంచుకున్న కాసేపటికే వరుణుడు ఎంట్రీ ఇచ్చి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.

ఆట జరగకపోయినా, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎంచుకున్న ప్లేయర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని పాకిస్థాన్ పక్కన పెట్టి, సల్మాన్ మీర్జాకు అవకాశం ఇచ్చింది. అలాగే సీనియర్ ప్లేయర్ ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకోవడం విశేషం. జమాన్ రాకతో బాబర్ ఆజం తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైన పిచ్‌పై కివీస్‌ను దెబ్బకొట్టాలనుకున్న పాక్ ఆశలు వర్షం వల్ల అడియాశలయ్యాయి.

స్పిన్ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని

మరోవైపు కివీస్ జట్టు కూడా స్పిన్ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇష్ సోధీని బరిలోకి దింపింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తిరిగి రావడం ఆ జట్టుకు పెద్ద బలం. స్లో వికెట్‌పై గట్టి పోటీ ఇవ్వాలని భావించిన న్యూజిలాండ్‌కు కూడా నిరాశే మిగిలింది. పాకిస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుండగా, న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.

Advertisment
తాజా కథనాలు