/rtv/media/media_files/2025/08/03/friends-day-2025-2025-08-03-11-19-07.jpg)
Friendship Day 2025
మానవ సంబంధాలలో అత్యంత విలువైనది, నిస్వార్థమైనది స్నేహం. చిన్న వయస్సులో పెరిగిన ఆ బంధాన్ని గుర్తుచేసుకుంటూ.. మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ (Friendship Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ (Technology) ఎంత పెరిగినా, మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియా వచ్చినా, నిజమైన స్నేహబంధానికి ఉన్న విలువ రోజూరోజూకు పెరుగుతోంది. కష్టాల్లో తోడుగా నిలబడే.. సంతోషంలో పాలుపంచుకునే.. ఎలాంటి స్వార్థం లేకుండా మన మంచిని కోరే స్నేహితులు మనిషి జీవితంలో ఒక భాగం. అలాంటి స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి.. వారి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం.
ఈ జగతిలో విలువైనది..
స్నేహితుల దినోత్సవం సందర్భంగా యువతలో, కళాశాల విద్యార్థుల్లో సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది స్నేహితులు (friends) కలిసి సినిమా హాళ్లకు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు. మరికొందరు తమ స్నేహితులకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టి.. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు వీడియో కాల్స్ (Video calls) ద్వారా పలకరించుకుంటూ.. పాత జ్ఞాపకాలను (old memories) నెమరువేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు స్నేహితుల ఫోటోలు, స్టేటస్‌లతో నిండిపోయాయి. ఈ సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు స్నేహబంధం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు (Special programs) నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా..? ఈ వ్యాధులు శరీరంలోకి వచ్చినట్లే.!!
స్నేహం శాంతికి, సామరస్యానికి పునాదని సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి స్నేహబంధాలు ఎంతో అవసరం. స్నేహితులు కేవలం సంతోషాలను పంచుకోవడానికి మాత్రమే కాకుండా.. ఒకరికొకరు అండగా నిలబడి.. కష్ట సమయాల్లో ధైర్యాన్నిచ్చే శక్తిని కలిగి ఉంటారు. నగరాల్లో స్నేహితులతో సందడి (friends noise)గా మారాయి. చిన్ననాటి మిత్రుల కలయికలు, పాత స్కూల్, కాలేజీ గ్రూపుల సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక కప్పు టీతోనో, ఒక సరదా కబురుతోనో మొదలైన స్నేహాలు జీవితాంతం కొనసాగాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. నేడు స్నేహితుల దినోత్సవం (Friendship Day) సందర్భంగా.. మన జీవితాలను అందంగా మార్చిన ఆత్మీయ మిత్రులను గుర్తుచేసుకుందాం. వారి పట్ల మనకున్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరుద్దాం. స్నేహం చిరకాలం వర్ధిల్లుతుందని ఆశిద్దాం. మీ ప్రియమైన స్నేహితులు మీతో ఉన్న ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకమే. మీ జీవితంలో ఇలాంటి స్నేహితుడు ఉన్నందుకు చాలా అదృష్టం. కొన్ని బంధాలు రక్తబంధం కన్నా గొప్పవిగా ఉంటాయి. మన స్నేహం కూడా అలాంటిదే. పుట్టకతో వచ్చేవి బంధాలయితే.. దేవుడు ఇచ్చే గొప్ప వరం స్నేహితుడు. జీవితాంతం మన స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయ పుర్వక శుభాకాంక్షలు తెలుపుదాం.
ఇది కూడా చదవండి: పీచు టీతో కిడ్నీలోని రాళ్లకు చెక్.. అద్భుత ప్రయోజనాలు ఇవే..!!
( Friendship Day 2025 | latest-telugu-news | healthy life style | daily-life-style | human-life-style )