ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరవ్వనున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

author-image
By K Mohan
New Update
ambani trump

ambani trump Photograph: (ambani trump)

అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ పట్టాభిషేకానికి భారతయ కుబేరుడు ముఖేష్ అంబానీ సతీసమేతంగా హాజరవుతున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు.  

Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రంప్ ప్రమాణస్వీకార మహాత్సవానికి రెసెప్షన్, బాణసంచా ప్రదర్శనతో వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మొదలవుతాయి. క్యాబినెట్ రెసెప్షన్, ఉపాధ్యక్షుడు ఏర్పాటు చేసే డిన్నర్‌లోనూ ‌అంబానీలు పాల్గొంటారు. ఇనాగరేషన్‌కు ముందు జరిగే క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో ట్రంప్, ఉపధ్యక్షుడిగా ఎంపికైన జేడీ, ఉషా వాన్సెలతో కలిపి వీరు పాల్గొంటారు.

Also Read: Australian Open- Basavareddy: జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు.. ఎవరు ఈ బసవరెడ్డి!?

బిలియనీర్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బెర్గ్, పలువురు వ్యాపారవేత్తలు, టెక్ కంపెనీల ఓనర్స్ కూడా అమెరిలో అధ్యక్షుడి పట్టాభిషేకానికి వస్తున్నారు. ట్రంప్ గతంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా 2017 నుంచి 2021 వరకూ పనిచేశారు. రెండవ సారి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి గెలిచి సోమవారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Read also ; ట్రంప్‌ సుంకాలు..పన్నుల దెబ్బ తప్పదు: కెనడా మంత్రి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు