Canada: ట్రంప్‌ సుంకాలు..పన్నుల దెబ్బ తప్పదు: కెనడా మంత్రి!

ట్రంప్‌ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్‌ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. భరించలేని టారిఫ్‌ లు విధిస్తానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
canada min

canada min

Canada: భరించలేని స్థాయిలో టారిఫ్‌ లు విధిస్తానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తున్న నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ స్పందించారు. ట్రంప్‌ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్‌ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు. ఈ మేరకు విలేకర్లు సమావేశంలో ఆమె మాట్లాడారు.

Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

అమెరికా, కెనడాల మధ్య చాలా సంవత్సరాల తరువాత ఇదే అతిపెద్ద వాణిజ్య యుద్ధమని మెలానీ అన్నారు. ఏ వాణిజ్యంలోనైనా కఠినమైన ప్రతిస్పందన తప్పకుండా ఉంటుందని ఆమె ప్రతిజ్ఙ చేశారు. ట్రంప్‌ తన హెచ్చరికలు అమలు చేస్తే ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందన్నారు. 

Also Read: Australian Open- Basavareddy: జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు.. ఎవరు ఈ బసవరెడ్డి!?

కట్టడి చేయలేకపోతే...

ఆ చర్య తమ వినియోగదారులు, కెనడా ఉద్యోగుల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.ఇటీవల కెనడా, మెక్సికోల పై 25 శాతం సుంకం విధించినున్నట్లు ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయలేకపోతే అమెరికాలో 51 వ రాష్ట్రంగా చేరాలంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కు చురకలంటించారు.

ట్రంప్‌ హెచ్చరికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కెనడా ఇప్పటికే స్పష్టం చేసింది.మరో వైపు ట్రూడో తన ప్రధాని పదవితో పాటు లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసేవరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: Arvind Kejriwal: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు కొత్త నగలు కొనుగోలు చేస్తారు..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి మరి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు