ఆగస్టు 1 నుంచి టీడీపీ ప్రాజెక్టుల యాత్ర
ఏపీలో ప్రాజెక్టుల సందర్శన యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 69 నదులు ఉన్నా.. సీఎం జగన్ మాత్రం వాటిని ప్రజలకు ఉయయోగపడే విధంగా చేయడంలేదని మండిపడ్డారు.