నేటి నుంచి ఉపవాసదీక్షలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!!

నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ ఉపవాస దీక్షను మూడు రోజుల ఆచరించనున్నారు. ఈ రోజు నుంచే ఈ దీక్షను ప్రారంభించినట్లు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీక్ష నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగనుంది.

author-image
By Bhoomi
New Update
నేటి నుంచి ఉపవాసదీక్షలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఉపవాస దీక్షలో పాల్గొననున్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా జనసేనాని ఈ దీక్షను ప్రారంభించారు. ఉపవాసదీక్షను నవరాత్రులు చివరి మూడురోజులు ఆచరించాలని తొలుత భావించినప్పటికీ...మంగళవారం నుంచే దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు.

Janasena chief Pawan Kalyan on upavasadeeksha from today..!!

వచ్చేనెల గురుపౌర్ణమి నాటి నుంచి చాతుర్మాస దీక్ష కూడా ఎప్పటిలాగే ఆచరించనున్నట్లు తెలిపారు. అందువల్ల ఈ ఉపవాస దీక్షను కార్తీక మాసాంతం వరకు కొనసాగించే అవకాశం ఉంది. దీక్షకాలంలో పాలు, ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. లోక కల్యాణార్థం ఈ మధ్యే మంగళగిరిలో మహాయాగం నిర్వహించిన నాటినుంచి పవన్ కళ్యాణఫ్ శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారట.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు