Crime: 11ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన కోర్టు తీర్పు.. గొంతుకోసి చంపిన తల్లి!

అమెరికాలో మరో దారుణం జరిగింది. భర్తతో విడాకుల కారణంగా 11 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపింది భారత సంతతికి చెందిన సరితా రామరాజు. బిడ్డను తండ్రికి అప్పగించాలని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

New Update
mother kills son

mother kills son

Crime: అమెరికాలో మరో దారుణం జరిగింది. భర్త మీద కోపంతో తల్లే తన కన్న బిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది. విడాకుల గొడవల నేపథ్యంలో కొడుకును తండ్రికి ఇవ్వాలని కోర్టు తీర్పును జీర్ణించుకోలేకపోయింది. తనకు దక్కనివాడు భర్తకు కూడా దక్కకూడదనుకుని దారుణానికి పాల్పడింది. 11 ఏళ్ల బాలుడిని గొంతు కోసి చంపడం కలకలం రేపుతుండగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కొడుకు బాధ్యతలు భర్తకే..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన సరితా రామరాజు (48) అనే వివాహిత 2018లో భర్త ప్రకాశ్‌ రాజు నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన 11 ఏళ్ల కొడుకు తన దగ్గరే వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో ఉంటున్నాడు. అయితే కొడుకు బాధ్యతలను కోర్టు భర్తకే అప్పగించగా.. సరితకు అప్పుడప్పుడు కలిసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే తన కొడుకును తండ్రి దగ్గరకు వెళ్లేలోపు సంతోషంగా చూసుకోవాలనుకుంది.

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

 దీంతో కాలిఫోర్నియాలోని శాంటా అనాలో ఓ హోటల్‌లో రూమ్‌ అద్దెకు తీసుకుంది.  అతను సరదాగా గడిపేందుకు డిస్నీల్యాండ్‌లో పాస్‌లను సైతం కొనుగోలు చేసింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. మార్చి 19న బాలుడిని తండ్రికి అప్పగించాల్సి ఉంది. అది సరితకు నచ్చలేదు. అదే రోజున ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ బాలుడి గొంతు కోసి చంపిన సరిత.. తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. 

Also Read : జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

killed | father | america | telugu-news | today telugu news | latest-telugu-news 

Advertisment
తాజా కథనాలు