Venu Swamy Apology: ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి..

వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు కోరారు.  హీరో నాగచైతన్య, శోభితల వివాహం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి మహిళా కమిషన్‌ ముందు వెల్లడించారు.

author-image
By Madhukar Vydhyula
New Update
venu swamy

Venu Swamy Apology

Venu Swamy Apology: వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు(Telangana State Commission for Women) బహిరంగ క్షమాపణలు కోరారు.  హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. గతంలో పలు వివాద జాతకాలు చెప్పిన వేణుస్వామి ఇటీవల వివాహం చేసుకున్న నటుడు నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.

Also Read: డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు 

వేణు స్వామికి(Venu Swamy) ఉమెన్ కమిషన్ హెచ్చరిక 

కాగా వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది.  దీనిపై స్పందించిన తెలంగాణ ఉమెన్‌ కమిషన్‌  వేణు స్వామి కి నోటీసులు జారీచేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ  వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా గతంలో ఇచ్చిన కోర్టు స్టేను ఎత్తివేయడంతో పాటు కోర్టు సైతం ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఉమెన్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు కోరారు. కాగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం  కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.

Also Read: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!

 సెలబ్రేటీల జీవితాల గురించి తరుచూ జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి విమర్శల పాలయ్యారు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ పెళ్లి చేసుకున్నా విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పాడు. అయితే, కారణాలు ఏవైనా ఆయన చెప్పినట్లుగానే నాగ చైతన్య, సమంత విడిపోయారు. ఇటీవల నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నా విడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పాడు. దీంతో వేణుస్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.  

Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు