Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!

ఉద్యోగం పోయిన లేదా రాని యువత వాళ్ల పరువు కాపాడుకోవడానికి చైనాలో ఓ కొత్త ట్రెంట్ సెట్ చేశారు. డబ్బులు కట్టి మరీ రోజూ జాబ్ చేస్తున్నట్లు ఫేక్ జాబ్ కంపెనీల్లో నటిస్తున్నారు. అక్కడ ఈ ఫేక్ జాబ్ కంపెనీలు యాడ్స్‌ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ అవుతుంది.

New Update
 job

fake job trend Photograph: (fake job trend )

Chine Fake Jobs: జాబ్‌లో నుంచి తీసేసినా.. మనం ఉద్యోగం మానేసినా.. ఉద్యోగం పోతే.. ఇంట్లో, బయట చెప్పుకోడానికి మోహమాట పడుతుంటారు. ఉద్యోగం లేకున్నా.. జాబ్ చేస్తు్న్నామని చెప్పుకుంటూ తిరుగుతుంటారు కొందరు. మరికొందరేమో ఎక్కువ జీతం వస్తుందంటూ గొప్పలు చెప్పుకుంటారు. సరిగ్గా ఇలాంటిదే చైనాలో ఫేక్ జాబ్ ట్రెంట్ అవుతుంది. ఇందులో చేయ్యని ఉద్యోగాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. మన సాలరీ ఎంతనో కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వింత ఎంటంటే వాళ్లు డబ్బులు మనకు ఇవ్వరు మనమే వాళ్లకు తిరిగి ఫీజు ఇవ్వాలి. ఖాళీగా ఉన్నామని బయట చెప్పుకోలేని వారికి ఇదో బంపర్ ఆఫర్. ముఖ్యంగా ఉద్యోగాలు లేకపోయినా వారి పరువు కాపాడే ఈ ట్రెండ్ ఏంటి.. దీన్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Read also :స్పామ్ కాల్స్‌కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్

చైనాలో జనాభా ఎక్కువ, నిరుగ్యోగం కూడా ఎక్కువే. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వాళ్లను కూడా కంపెనీలు తీసేస్తూ.. వారిని నిరుద్యోగులుగా మారుస్తున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగం కోల్పోయిన వారు, కొత్తగా ఉద్యోగం వచ్చిందని చెప్పి పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే యువత కొత్త ట్రెండ్ సృష్టించారు. అదే ఈ ఫేక్ జాబ్ ట్రెండ్.. అంటే ఉద్యోగం లేకపోయినా సరే ఉద్యోగం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే ఓ సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చారు.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

ఫేక్ జాబ్ ట్రెండ్! (China Fake Jobs)

ఈ ఫేక్ జాబ్‌ చేస్తున్నట్లు చెప్పుకొని పరువును కాపాడుకోవాలనుకుంటే కొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై తమకు నచ్చిన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై సూటు, బూట్లు వేసుకుని ఆఫీసుకు వెళ్లవచ్చు. ఈ ఫేక్ ఆఫీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి అచ్చం నిజమైన ఆఫీస్‌లా కనిపించే ఓ సెటప్. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు నటించాలంటే ఫీజు చెల్లించాలి. వారి డిసిగ్నేషన్‌ను బట్టి వారు రెంట్ కట్టాలి. ఈ ఫేక్ జాబ్‌లో ఎంప్లాయ్ నుంచి సీఈఓ దాకా అన్నీ పోస్టులు ఉంటాయి.

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

తామే కొత్తగా కంపెనీ పెట్టినట్లు చెప్పుకునే వాళ్లు.. రోజుకు 30 యువాన్లు అంటే 350 రూపాయలు చెల్లిస్తూ ఆ భవనాలను అద్దెకు తీసుకోవచ్చు. అందులో మేనెజర్‌గా  ఉండాలంటే రోజుకు రూ.580 చెల్లించాల్సి. చిన్న చిన్న ఎంప్లాయిస్‌లా నటించాలంటే కొంత అమౌంట్ కడితే చాలు. డబ్బులు ఇస్తే అక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తు్న్నారు. అయితే ప్రస్తుతం చైనాలో ఈ ఫేక్ జాబ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఉద్యోగం ఊడిపోయినవాళ్లు పరువు కాపాడుకోవాలంటే ఈ ట్రెండ్ ఫాల్లో అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫేక్ జాబ్ గురించి చైనాలో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా వస్తున్నాయి. దాంతోనే ఈ వార్త వైరల్ అయింది.

Also Read :  లాస్‌ ఏంజెలెస్‌ నుంచి మహేశ్‌ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు