Priyanka Chopra: లాస్‌ ఏంజెలెస్‌ నుంచి మహేశ్‌ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!

అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో మహేశ్‌- రాజమౌళి # #SSMB29 కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

New Update
Priyanka chopra

Priyanka chopra

Tollywood : రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  #SSMB29. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా క్షణాల్లో వైరలవుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్  ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబద్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కనిపించారు. దీంతో మహేశ్‌- రాజమౌళి #SSMB29  ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  

Also Read : సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

Rajamouli - Mahesh Babu Combo SSMB29

Also Read :  'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే?

ఇటీవలే చిత్రబృందం పూజ కార్యక్రమాలతో సినిమాను  గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.   అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) ఇదివరకు కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. 

Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!

Also Read :   Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు