Chilkur Balaji Temple: రంగరాజన్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ..ఏమన్నారంటే...

రామరాజ్యం సంస్థ పేరుతో చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ పై వీర రాఘవరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చకులు రంగరాజన్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

New Update
 Rangarajan chilkur

Rangarajan chilkur

Chilkur Balaji Temple: రామరాజ్యం సంస్థ(Ramarajyam Sanstha) పేరుతో చిలుకూరు అర్చకులు రంగరాజన్‌(Chilukuru Archakulu Rangarajan) పై వీర రాఘవరెడ్డి(Veera Raghav Reddy) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) పరామర్శించారు. రంగరాజన్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించి.. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ గారి కుటుంబంపై దాడి బాధాకరమన్నారు. ఈ సందర్భంగా రంగరాజన్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పరామర్శ తమకు కొండంత బలమన్నారు.

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

కాగా, చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పురుకు చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి 2022లో ఫేస్‌బుక్‌ వేదికగా రామరాజ్యం సంస్థను ప్రారంభించాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి రామరాజ్యం సైన్యంలో చేరేలా ప్రజలను ప్రేరేపించాడు. రిజిస్టర్‌ చేసుకున్నవారికి రూ.20 వేలు వేతనం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటనకు 25 మంది స్పందించి రామరాజ్యం సైన్యంలో చేరారు.

Also Read :  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

కాగా రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డిని  పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 18  నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన చాలా కీలక అంశాలు బయటపడ్డాయి.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అనేక అక్రమాలు.. 

పోలీసుల దర్యాప్తులో వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అనేక అక్రమ కార్యకలాపాలు చేసినట్లు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డిపై 2015, 2016 లోనూ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలోనూ వివిధ నేరాలకు పాల్పడిన అతను, ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ ను  ఉగాది వరకు సమయం ఇస్తున్నామని బెదిరించడం గమనార్హం. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై రామరాజ్యం వీరరాఘవరెడ్డితో పాట అతని అనుచరులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  8 మందిని  అరెస్ట్ చేశారు.

Also Read :  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Also Read: BIG BREAKING: మోనాలిసాకు బిగ్ షాక్.. మోసం చేసిన డైరెక్టర్?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు