Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని అన్నారు. అందువల్ల 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలని పేర్కొన్నారు.

New Update
Gyanesh Kumar assumes charge as chief election commissioner

Gyanesh Kumar assumes charge as chief election commissioner

Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇటీవల నియామకం

కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల నూతన కమిషనర్‌‌గా జ్ఙానేశ్‌ కుమార్‌ ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్‌ కుమార్‌ నిలిచారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుండడంతో నూతన సీఈసీని సోమవారం ఎంపిక చేశారు.

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

అంతకుముందు ఇదే అంశం పై సమావేశమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విపక్ష నేత రాహుల్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ గా నియమితులైన జ్ఙానేశ్‌ కుమార్‌.. 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఆయన బ్యాగ్రౌండ్‌ ఇదే..

జ్ఙానేశ్‌ కుమార్‌ కేరళ కేడర్‌ కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌  అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్‌‌గా వ్యవహరిస్తున్నారు. మరో కమిషనర్‌ గా ఉన్న సుఖ్‌బిర్‌ సింగ్‌ సాంధూ ఉత్తరాఖండ్‌ కేడర్‌ కు చెందిన వారు. జ్ఙానేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పని చేశారు. కశ్మీర్‌ డివిజన్‌ జాయింట్‌ సెక్రటరీగా ఉన్న ఆయన.. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

సుప్రీం కోర్టులో అయోధ్య రామజన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్వహణ బాధ్యత వహించారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందారు. గతంలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ పదవీ విరమణ అనంతరం అత్యంత సీనియర్‌ గా ఉన్న ఎన్నికల కమిషనర్‌ ను సీఈసీగా నియమించే వారు. గత సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన నూతన చట్టం ప్రకారం అన్వేషణ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను రూపొందించింది. దాని గురించి ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, ఈసీలను నియమిస్తుంది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

ఇదిలా ఉంటే కొత్త సీఈసీ ఎంపిక భేటీ నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ గట్టిగా పట్టుపట్టింది. సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను ఫిబ్రవరి 19న సుప్రీం కోర్టు విచారించనున్నందున దీన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మనుసింఘ్వీ కోరారు. సీఈసీ సెలక్షన్‌ కమిటీ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలతో ప్రభుత్వం నియంత్రణ కోరుకుంటున్న విషయం అర్థం అవుతుందని అన్నారు. అయితే ఈ భేటీకి రాహుల్‌ గాంధీ హాజరయ్యారని చెప్పినప్పటికీ..ఏం మాట్లాడారనే విషయాన్ని మాత్రం సింఘ్వీ వెల్లడించలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు