Monalisa: మోనాలిసాకు బిగ్ షాక్.. మోసం చేసిన డైరెక్టర్?

మోనాలిసాకు 'ది డైరీ ఆఫ్ మణిపుర్' లో హీరోయిన్ ఛాన్స్ సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయేలా ఉందని తెలుస్తోంది. నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని, అవకాశాలిస్తానని అమ్మాయిలను తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు.

New Update
Monalisa about sanoj Mishra

Monalisa about sanoj Mishra

Monalisa: ఎక్కడో  కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న మోనాలిసా.. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె నీలి కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్షేషన్ గా మారింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నెక్స్ట్ ఫిల్మ్  ‘ది డైరీ ఆఫ్ మణిపుర్' లో హీరోయిన్ గా నటించనుంది. 

Also Read :  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

మొనాలిసాకు బిగ్ షాక్ 

అయితే మోనాలిసా కు హీరోయిన్ ఛాన్స్ అయితే వచ్చింది కానీ.. ఆ సినిమా పట్టాలెక్కేలా లేదని టాక్ వినిపిస్తోంది. తాజాగా నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా పై సంచలన ఆరోపణలు చేశారు. సనోజ్ మిశ్రా తాగుబోతని.. సినిమా ఆవకాశాలిస్తానని చెప్పి అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు. అతడి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు. 

Also Read :  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

Also Read :  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

సనోజ్ మంచివారు 

ఇది ఇలా ఉంటే.. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నిర్మాత జితేంద్ర ఆరోపణలను ఖండించారు. మరోవేపు మోనాలిసా కూడా దీనిపై స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేసింది. సనోజ్ చాలా మంచివారని.. తనను ఒక కూతురిలా చూసుకుంటున్నారని తెలిపింది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్‌' లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురిగా కనిపించబోతుంది. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఏప్రిల్ నుంచి మోనాలిసా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు