TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో మరో 200 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు వినతులు వచ్చినట్లు సమాచారం.
సర్పంచ్ ఎన్నికల్లో ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధను కూడా తొలగించింది.
ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా ఇకపై స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది.
తెలంగాణాలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఆగస్టులో ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారని సమాచారం.