TSRTC Strike Notices: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు... ఫిబ్రవరి 9 డెడ్‌లైన్

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు తమ 21 డిమాండ్లతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీసులు పంపాయి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ లీడర్లు సంస్థను కోరారు.

author-image
By K Mohan
New Update
RTC noties

RTC noties Photograph: (RTC noties)

TSRTC Strike Notices: తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు(RTC Unions) తమ 21 డిమాండ్లతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు(RTC Prviatization) వ్యతిరేకంగా సమ్మె నోటీసులు పంపాయి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ లీడర్లు సంస్థను కోరారు. లేనిపక్షంలో ఫిబ్రవరి 9 నుంచి ఆర్టీసీలో సమ్మె చేపడతామని బస్ భవన్ లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ముని శేఖర్‌కి ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె నోటీస్ అందజేశారు. 

Read Also: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్!

డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతాం..

కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా ప్రభుత్వంలో విలీనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్టీసీ జేఎసీ నాయకులు మండిపడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు అన్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు డిమాండ్లు అందులో ఉన్నాయి. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని  హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు.

Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?

Also Read:  రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!

Also Read: పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటా.. డిప్యూటీ సీఎం నాకొద్దు.. లోకేష్ సంచలన కామెంట్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు