Woman Tries to Open IndiGo Flight Door: విమానంలో మహిళ హల్‌చల్‌.. తీరా చూస్తే ఆమె...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన విమానంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. దీంతో ప్రయాణీకులు హడలిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆయోమయానికి గురయ్యారు. తీరా ఆమె గురించి తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్!

Woman Tries to Open IndiGo Flight Door

Woman Tries to Open IndiGo Flight Door: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) నుంచి బయలు దేరిన విమానంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. దీంతో ప్రయాణీకులు హడలిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆయోమయానికి గురయ్యారు. తీరా ఆమె గురించి తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

మహిళా ప్రయాణికులు హల్‌చల్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో  మహిళా ప్రయాణికులు హల్‌చల్‌ చేసింది. ఎమర్జెన్సీ డోర్‌ తీయడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను గమనించిన ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో వారిపై మహిళా ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసేదిలేక ఆమెను పోలీసులకు అప్పగించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానం పార్కింగ్‌ స్థలం నుంచి టేకాఫ్‌ తీసుకోవడానికి రన్‌వే పైకి బయలు దేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..

ఎమర్జీ డోర్‌ తీయడానికి..

కర్ణాటకకు  చెందిన మహిళ భువనేశ్వర్‌ వెళ్లడానికి విమానం ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆమె విమానం లోని ఎమర్జీ డోర్‌ ను తీయడానికి యత్నించింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వారిపట్ల దురుసుగా ప్రవర్తించింది .దీంతో విమానం ఆపి ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణలో ఆ  ప్రయాణికురాలికి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు గుర్తించారు.

Also Read: IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

Also Read: Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు