Wine Shops: మందుబాబులకు షాక్.. ఆరోజున వైన్‌ షాపులు బంద్

ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు.

New Update
Wine Shops

Wine Shops

ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆరోజున వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశారు జారీ చేశారు. అయితే స్టార్ హోటళ్లోని బార్లు, రిజిస్టర్డ్‌ చేసుకున్న క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు.

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

Wine Shops Bandh In Hyderabad

తమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దొంగచాటుగా ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వాళ్ల లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. హనుమాన్ జయంతి రోజున ఎలంటి మతపరమైన గొడవలు జరగకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Also Read: ఇదేం మూర్ఖత్వం.. పిరియడ్స్ ఉన్న విద్యార్థికి క్లాస్ బయట పరీక్ష

ఇదిలాఉండగా తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ మద్యానికి జారీ చేసిన ప్రకటనకు సైతం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మద్యం సరఫరాదార్లు, తయారీ దార్ల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి.  తాము 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామని 92 మద్యం సరఫరా చేసే కంపెనీలు అప్లై చేసుకున్నాయి. ఈ 604 బ్రాండ్లలో 331 ఇండియన్​ మేడ్​ ఫారిన్​ లిక్కర్​ బ్రాండ్లు ఉన్నాయి. మిగతా 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయి.

Also Read:  బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

Also Read :  షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఆమెపై అరెస్ట్ వారెంట్

today-news-in-telugu | latest-telugu-news | latest telangana news | telangana news live updates | breaking news in telugu | hanuman-jayanti

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు