హనుమాన్ జయంతికి భారీ ఏర్పాట్లు | Hanuman Shobha Yatra | Shri Tadbund Veeranjaneya Swami Temple | RTV
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. చైత్ర మాసం ఏపిల్ 12 పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజూ పంచదార దానం, నెయ్యి దీపం, అన్నదానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.54 అడుగుల హనుమాన్ విగ్రహం పోస్టర్ ను ప్రముఖ ఎక్స్ వేదిక ద్వారా విడుదల చేస్తారు. దీన్ని చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.