హైదరాబాద్లో భారీ పేలుళ్లు.. భయంతో పరుగులు తీసిన జనం!
హైదరాబాద్ కోకాపేట్లో భారీ పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేయగా పెద్ద బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పలువురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.