/rtv/media/media_files/2025/06/25/young-woman-commits-suicide-2025-06-25-17-25-49.jpg)
Young woman commits suicide
TG Crime: హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ని ఓయో హోటల్ లో యువతి అనుమానస్పద స్థితిలో మరణించింది. యువతిది, హత్యానా, ఆత్మహత్యానా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో మరణించిన యువతిని నల్లగండ్లలో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న అనూషగా గుర్తించారు. అనూష రాయదుర్గంలోని ఓయో హోటల్లో ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: బరువు తగ్గేందుకు భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన ఇంజెక్షన్
బ్యూటిషియన్ అయిన అనూష గత కొంతకాలందగా నల్గగండ్లలో నివాసం ఉంటోంది. ఆమెకు వివాహం అయినప్పటికీ భర్తతో ఏర్పడ్డ విభేదాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఎప్పటిలాగే ఈ నెల 22న తన స్నేహితుల వద్దకు వెళుతున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోన్ చేసినా స్పందించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్ లో ఓ యువతి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
కాగా యువతి గది నుంచి ఎంతకి బయటకు రాకపోయేటప్పటికీ గమనించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి అనూషగా గుర్తించి తల్లిదండ్రులకు సమచారం అందించారు. కాగా అనూష ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు రాయదుర్గం పోలీసులు. అయితే, అనూష ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పక్కాగా తెలియాల్సి ఉంది. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో బీట్‌రూట్ రసం తాగితే ఏమవుతుందో తెలుసా..?