KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది

ఎల్కతుర్తి రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి చెరువుల పూడిక తీస్తే.. నేడు అవే బుల్డోజర్లు పెట్టి పేద గుడిసెలు కూల్చారని కేసీఆర్ మండిపడ్డారు.

New Update
KCR

KCR

ఎల్కతుర్తి రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి చెరువుల పూడిక తీస్తే.. నేడు అవే బుల్డోజర్లు పెట్టి పేద గుడిసెలు కూల్చారని కేసీఆర్ మండిపడ్డారు. హైడ్రా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ భూములు అమ్ముతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో భూముల రేట్లు తగ్గాయని.. రాష్ట్ర అభివృద్ధిని మొదటి స్థానంలో నిలబెడితే.. ఇయ్యాల దాన్ని 14, 15 స్థానానికి తెచ్చారని విమర్శించారు. నా కళ్లు ముందే ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదని అన్నారు. చాలా భాద కలుగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనుక బడుతుందని అసంతృత్తి వ్యక్తం చేశారు. 

Also Read :  రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కారణం అదేనా?

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

KCR Warangal Meeting

హైచ్సీయూ భూములు విషయంలో ప్రభుత్వం విధానాన్ని ఖండించారు. అమ్మవచ్చు కానీ.. ఏ భూములు అమ్మాలో అనే విచక్షణ కూడా ప్రభుత్వానికి ఉండాలని ఆయన విమర్శించారు. అభివృద్ధికి అవసరమైతే భూములు అమ్మవచ్చు.. కానీ యూనివర్సిటీ భూములు అమ్ముతారా అని నిలదీశారు. 

ప్రభుత్వం కాంగ్రెస్ సంక్షేమంలో ఫేల్, సాగునీరు ఇవ్వడంలో ఫేల్, కరెంటు ఇవ్వడంలో ఫేల్, రైతుబంధులో ఫేల్, విత్తనాలు ఇవ్వడంలో ఫేల్ అని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు తీసుకొని పనులు చేస్తోందని విమర్శించారు.

2014 కంటే ముందు ఎలా ఉండేదో దానికంటే దారుణమైంది. పేదలకు గుడిసెలు వేసుకోమని జాగలు ఇస్తే హైడ్రా పేరుతో వాటిని కూల్చేస్తున్నారు. దేశంలో నెం 1 రాష్ట్రాన్ని 15వ స్థాయికి పడగొట్టారన్నారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు ఇప్పటికైనా ఆలోచన చేయాలన్నారు. పరిష్కారం వెతకాలని చెప్పారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలని, పోయినకాడగనే దొరకపట్టుకోవాలన్నారు. భూములు అమ్మితే తప్పేంకాదు. కానీ యూనివర్సిటీ భూములు అమ్ముతారా? అని ప్రశ్నించారు. ఏ భూములు అమ్మాలనే సోయి లేదా అని అడిగారు.

Also Read :  వరంగల్‌ సభలో హరీశ్‌ రావుపై కేసీఆర్ ప్రశంసలు..

Also Read :   45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

brs | kcr | telangana | warangal | hydra | hcu | 400 acres hcu land issue

Advertisment