Sankranti :  ఖాళీ అవుతున్న హైదరాబాద్..బోసి పోయిన రోడ్లు

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ వాసులు తమతమ సొంతూళ్లకు తరలివెళుతుండటంతో హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. ప్రధాన రహదారులు తప్ప..కాలనీల రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిపోతున్న జనంతో  ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది.

New Update
FotoJet - 2026-01-11T164241.591

Hyderabad is becoming empty..roads are deserted.

Sankranti : సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ వాసులు తమతమ సొంతూళ్లకు తరలివెళుతుండటంతో హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. ప్రధాన రహదారులు తప్ప..కాలనీల లోని రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిపోతున్న జనంతో  ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు అన్ని కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది.  నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కానీ, కాలనీలు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది.

హైదారాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లేందుకు  ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్,  ఎంజీబీఎస్‌, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయినప్పటికీ.. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో బస్టాండ్లకు వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి. టిక్కెట్లు దొరక్క, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన వారైతే..అనేక అవస్థలు పడుతున్నారు.

కాగా సంక్రాంతి పండుగకు ఏపీ వాసులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు గడచిన రెండు మూడు నెలలుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రానున్న రెండు రోజుల వరకు బస్సులు, రైళ్లలో అన్ని రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్, కౌంటర్ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి సరిపోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రేపటి వరకు అన్ని ప్రధాన రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ స్టార్ట్‌

ఇక ఆర్టీసీ, రైల్వేలలో రిజర్వేషన్లు దొరక్కపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో అవకాశంగా తీసుకున్న.. ప్రైవేట్ ట్రావెల్స్‌ యజమాన్యాలు ధరలను విపరీతంగా పెంచాయి.  సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నట్లు  ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాహనాల్లో సీట్లు దొరకని ప్రయాణికులు చేసేదేమీ లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు.. సాధారణ చార్జీల కంటే మూడు రెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణీకులు చేసేదేమీ లేక ఎక్కవ ధర అయినా చెల్లించి రిజర్వేషన్లు చేయించుకోవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు