/rtv/media/media_files/2025/01/05/HAlcaEgcNo5EYkkBun4B.jpg)
EVM (File Photo)
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర ప్రజల చూపంతా ఈ ఎన్నికపైనే ఉంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మృతితో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. వీరితో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు, ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగులు, రైతులు నామినేషన్లు వేయడంతో ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియగా, అధికారులు నామినేషన్ల స్క్రూటినీని పూర్తి చేశారు. దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ ప్రక్రియ జరపగా అందులో 130 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 81 మంది అభ్యర్థులకు చెందిన 135 నామినేషన్లను మాత్రమే ఆమోదించారు.
Also Read: ప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా..!
Election Officer's key Announcement
అయితే అభ్యర్థులు ఎక్కువైతే బ్యాలెట్ పేపర్(ballot-box) ఉపయోగిస్తారన్న వార్తలపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వివరణ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా పోలింగ్ కు ఈవీఎంలే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. 64 మంది అభ్యర్థులు దాటితే M3 ఈవీఎంలు ఉపయోగిస్తామని.. బ్యాలెట్ పేపర్స్ తో ఓటింగ్ ఉండబోదని తేల్చి చెప్పారు.
Also Read: ప్రభాస్ బర్త్‌డే కు గీత ఆర్ట్స్ స్పెషల్ వీడియో.. గూస్‌బంప్స్ అంతే..!
సరైన ఫార్మాట్ లో పత్రాలు సమర్పించకపోవడం,వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో పలువురు అభ్యర్థులకు చెందిన నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించారు . నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు సమయం ఉన్నందును తుది బరిలో ఎంత మంది నిలుస్తారనేది తెలవనుంది. రేపటి వరకు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై రేపు పూర్తి స్పష్టత రానుంది. రేపు సాయంత్రానికి జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారు అనేది అధికారిక ప్రకటన రానుంది.
Also Read: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!
కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubliee hills by election)కు పోలింగ్ నిర్వహించనున్నారు.. 14న కౌంటింగ్ జరిగి విజయం ఎవరిదో తేలనుంది.
Follow Us