/rtv/media/media_files/2025/04/27/GfWiSRTd4iWrxmZq9SVI.jpg)
Villagers Beaten Fake Babas in Motkur Mandal, yadadri
అమాయకుల వీక్నెస్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జనగామ జిల్లాకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు కళ్లెం విజయ్, జీవన్ లాల్, కృష్ణలు పక్కా ప్లాన్ వేశారు. ఆంజనేయస్వామి భక్తులమంటూ గ్రామాల్లో తిరుగుతూ కానుకలు సేకరిస్తున్నారు. అదే సమయంలో ప్రజల వ్యక్తిగత సమస్యలు చేసుకుని పూజలు పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
పూజలు చేస్తే సంతానం
ఇందులో భాగంగానే తాజాగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లారు. ఈ మేరకు ఆ గ్రామంలో ఓ కిరాణ షాప్ రన్ చేస్తున్న.. సతీష్, మహాలక్ష్మి దంపతులను కలిసారు. వారికి సంతానం లేరని తెలిసి పక్కా ప్లాన్‌తో వాళ్ల ఇంటికి వెళ్లారు. నరదృష్టి వల్లే మీకు సంతానం కలగడం లేదని.. పూజలు చేస్తే సమస్యలన్నీ పోయి.. సంతానం కలుగుతుందని బాగా నమ్మించారు.
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
రూ.19 ఖర్చు
అనంతరం ఆ దంపతులకు బొట్టు పెట్టి ఒక తాయత్తు కూడా కట్టారు. దీనికోసం ఆ దంపతుల నుంచి రూ.2 వేల వసూలు చేశారు. ఆపై చెట్ల పసరుతో సంతానం కలిగేలా చేస్తామని ఇంకాస్త వారిలో నమ్మకాన్ని నింపారు. అయితే దానికి కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని అన్నారు. దాని కోసం దాదాపు రూ.19 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇలాంటి వాటిని లేట్ చేయకూడదని.. ఏదో ఒకటి త్వరగా చెప్పండని తమ ఫోన్ నెంబర్లు ఇచ్చారు.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
చితకబాదిన గ్రామస్థులు
అయితే ఆ స్వాముల ప్రవర్తనకు అనుమానం వచ్చిన ఆ దంపతులు తమ గ్రామ సర్పంచ్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు దొంగ స్వాములని గుర్తించి.. వారి పని పట్టేందుకు గ్రామస్థులు రివర్స్ ప్లాన్ వేశారు. నెక్స్ట్ డే దొంగ స్వాములకు ఫోన్ చేసి పూజలు చేసేందుకు గ్రామానికి రమ్మన్నారు. ఈ మేరకు రూ.11 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఇలా ఫోన్ చేశారో లేదో అలా అరగంటలో ఊడిపడ్డారు. దీంతో గ్రామస్థులు వారిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే ఆ ముగ్గురు దొంగ స్వాములను గ్రామస్థులు చితకబాదేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
crime news | latest-telugu-news | telugu-news | telangana-crime