Laura Williams: హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌కు కొత్త కాన్సుల్‌ జనరల్‌ నియామకం

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులెట్‌కు కొత్త కాన్సుల్‌ జనరల్‌గా లారా విలియమ్స్‌ నియమితులయ్యారు. దశాబ్ధాల పాటు దౌత్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు.

New Update
US Consulate in Hyderabad welcomes Laura Williams as new chief

US Consulate in Hyderabad welcomes Laura Williams as new chief

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులెట్‌(US Consulate In Hyderabad) కు కొత్త కాన్సుల్‌ జనరల్‌గా లారా విలియమ్స్‌(Lara Williams) నియమితులయ్యారు. దశాబ్ధాల పాటు దౌత్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. యూఎస్‌ ఫారిన్‌ సర్వీస్‌లో ఆమె సీనియర్‌ సభ్యురాలుగా ఉంది. గతంలో ఆమె యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌లో కూడా డిప్యూటీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్ అధికారిగా సేవలందించారు. హైదరాబాద్‌లో సేవలందించడం.. అలాగే తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో అమెరికా-భారత్‌ సంబంధాలు మెరుగుపరచడం గౌరవంగా భావిస్తున్నానని లారా విలియమ్స్అన్నారు. 

Also Read: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్

US Consulate In Hyderabad

భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ప్రజల మధ్య సంబంధాలను విస్తరించడం, సాంకేతికతను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఆమె తన నిబద్ధతను తెలియజేశారు. ప్రభావవంతమైన నాయకత్వానికి గతంలో ప్రశంసలు పొందిన జెన్నిఫర్ లార్సన్‌ స్థానంలో తాజాగా విలియమ్స్‌ వచ్చారు. ఈమె లాటిన్ అమెరికా, యూరప్, అలాగే ఉత్తర ఆఫ్రికాలో కూడా రాయబార కార్యాలయాల్లో కీలక సేవలందించారు. విదేశీ సేవలో చేరడానికి ముందు లారా విలియమ్స్.. .యూఎస్ నేవీ సబ్‌మెరైన్ కమాండ్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ కాన్సులర్ అఫైర్స్ బ్యూరో అలాగే యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేశారు.

Also Read: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌..తల్లి గుట్టు విప్పిన కూతురు

 అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బీఏ సర్టిఫికేట్ పొందారు. అలాగే నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ నుంచి CIO, టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో బహుళ పరిశ్రమ సర్టిఫికేషన్‌లు పొందారు. మరోవైపు ప్రభావవంతమైన నాయకత్వానికి ప్రశంసలు పొందిన జెన్నిఫర్ లార్సన్ స్థానంలోనే లారా విలియమ్స్ వచ్చారు. ఈ సందర్భంగా జెన్నిఫర్‌కు లారా కృతజ్ఞతలు తెలిపారు. హైదరబాద్, ఇతర పరిసర ప్రాంతాల్లో బలమైన సంబంధాలు, సహకారాలు పెంపొందించేందుకు జెన్నిఫర్‌ అద్భుతంగా పనిచేశారంటూ కొనియాడారు. ఆమె వారసత్వాన్ని కొనసాగించేందుకు, మా ఉమ్మడి లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో నాయకులతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 

Also read: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజాను స్వాధీనం చేసుకోవడమే టార్గెట్..

ఇదిలాఉండగా కొత్త కాన్సుల్‌ జనరల్‌గా నియమితులైన లారా విలియమ్స్‌కు హైదరాబాద్‌లో అధికారులు స్వాగతం పలికారు. ఆమె నాయకత్వంలో అమెరికా-భారత్ సంబంధాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆమె నియామకం బలమైన భాగస్వామ్యానికి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 

Also Read: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం

Advertisment
తాజా కథనాలు