Election Commission: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్

వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్‌ ఓటర్లు ఉన్నారని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈసీ సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్‌ను కోరింది.

New Update
Election Commission seeks declaration under oath from Rahul Gandhi over vote chori allegations

Election Commission seeks declaration under oath from Rahul Gandhi over vote chori allegations

వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్‌ ఓటర్లు ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సంఘం(EC) పై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ ఈ వ్యవహారంపై మాట్లాడారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హర్యానా, కర్ణాటక ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. కర్ణాటకలోని మహదేవ్‌పూర్‌ నియోజకవర్గంలో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. ఈరోజే ఆ ఓటర్ లిస్టు అక్రమాల వివరాలు అందించాలని కర్ణాటక చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌ డిమాండ్ చేశారు. 

Also Read: భారత్‌ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలి.. శశిథరూర్

EC Seeks Declaration Under Oath From Rahul Gandhi

2024లో కర్ణాటకలో జరిగిన ఎంపీ ఎన్నికలపై ఇప్పుడు సవాలు చేయలేరని అన్నారు. ఎందుకంటే ఆ ఎలక్షన్ పిటిషన్ విండో ముగిసినట్లు తెలిపారు. అలాగే తప్పుడు సమాచారం ఇస్తే చట్టం ప్రకారం శిక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలాఉండగా గురువారం AICC ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. తమ టీమ్‌ ఆరు నెలల పాటు విచారణ చేసి ఈసీ ఓట్ల చోరీకి పాల్పడినట్లు బలమైన ఆధారాలను సేకరించిందని పేర్కొన్నారు. గత 10-15 ఏళ్ల మెషిన్-రీడబుల్‌ డేటాను, సీసీటీవీ ఫుటేజ్‌ను ఈసీ ఇవ్వకుంటే వారు నేరం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. 

2024 పార్లమెంటు ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం అలాగే మహదేవ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల డేటాను విశ్లేషించామని తెలిపారు. ఆ లోక్‌సభ మొత్తంలో కాంగ్రెస్‌కు 6,28,208 ఓట్లు రాగా బీజేపీకి 6,58,915 ఓట్లు వచ్చాయని తెలిపారు. ఆ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ ఆరుచోట్ల గెలిస్తే.. మహదేవ్‌పుర అసెంబ్లీ స్థానంలో మాత్రం 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందని తెలిపారు. ఇక్కడ ఓటింగ్‌ విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 

ఇదిలాఉండగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఊహకందని ఫలితాలు వచ్చాయన్నారు.  మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు కొత్తగా వచ్చినట్లు తెలిపారు. ఐదేళ్లలో నమోదైన వాళ్ల కంటే కేవలం ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ ఉన్నారన్నారు.  అలాగే మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య వ్యవధిలో ఏకంగా కోటి మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. 

కర్ణాటకలో ఓ సింగిల్‌ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇంటి నెంబర్‌ ‘0’ తో వంద ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్‌ సహా ఏడు ఎంపీ స్థానాల్లో అనూహ్యంగా ఓడిపోయామన్నారు. మహదేవ్‌పూర్‌లో లక్ష ఓట్ల చోరీ జరిగిందని.. 40 వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయని తెలిపారు. అలాగే అక్కడ ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయని ఆరోపించారు. అలాగే తాజాగా బీహార్‌ ఓట్ల తొలగింపుపై కూడా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Also Read :  ఓటర్ల జాబితా దేశ సంపద.. బీజేపీకోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

telugu-news | rtv-news | national news in Telugu | international news in telugu | latest-telugu-news | election-commission

Advertisment
తాజా కథనాలు