/rtv/media/media_files/2026/02/14/ex-offico-votes-2026-02-14-10-35-23.jpg)
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు ఎన్నికల కమిషన్(telangana-election-commission) షాక్ ఇచ్చింది. మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్లపై(Ex-officio votes) బాంబు పేల్చింది ఈసీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉండే ఎక్స్‌అఫీషియో అధికారానికి సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను విడుదల చేసింది. ఎవరు ఎక్కడ ఓటు వేయాలి అనే అంశంపై ఉన్న సందిగ్ధతను తొలగించింది. ఈ కొత్త నిబంధనలతో MLC, రాజ్యసభ సభ్యలకు మున్సిపాలిటి, కార్పొరేషన్‌లో ఓటు హక్కు లేకుంటే.. వారికి ఇక ఎక్స్ అఫిషియో ఓటు వేసే అవకాశం లేనట్టే. గతంలో MLC, రాజ్యసభ సభ్యులను ఆయా జిల్లాలో లేదా రాష్ట్రంలో పార్టీలకు అవసరమున్న చోట ఎక్స్ అఫిషియో ఓటు వేయించేవారు. కానీ ప్రస్తుతం కొత్త రూల్స్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముదిని ప్రకటించారు. - Municipal Election Results 2026
Also Read : ఒక్క ఓటు మ్యాజిక్.. మున్సిపల్ ఎన్నికల్లో అదృష్టవంతులు వీరే!
నిబంధనలు ఇలా..
ఎమ్మెల్యేలు & లోక్‌సభ సభ్యులు: వీరు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏదైనా ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో తమ ఎక్స్‌అఫీషియో ఓటును వినియోగించుకోవచ్చు. అంటే, నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే, వారు తమకు నచ్చిన చోట ఓటు వేసే అవకాశం ఉంటుంది.
ఎమ్మెల్సీలు & రాజ్యసభ సభ్యులు: వీరికి నియోజకవర్గ పరిమితి ఉండదు కాబట్టి, రాష్ట్రంలో వీరికి ఎక్కడైతే సాధారణ ఓటు హక్కు ఉంటుందో, ఆ మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్స్‌అఫీషియో ఓటును వినియోగించుకోవాలి. ఒకవేళ వీరి సాధారణ ఓటు హక్కు మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో లేకుంటే.. ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునే వీలు ఉండదు.
గడువు: ఈ ఎక్స్‌అఫీషియో ఓటు నమోదుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి నేటితో (గడువు తేదీ) సమయం ముగుస్తుంది. - latest telangana news
Also Read : కొత్తగూడెం మేయర్ స్థానం మాదే.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Follow Us