TG politics: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలువురు కేంద్రమంత్రులు సైతం అరెస్ట్‌పై స్పందించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బన్నీ అరెస్ట్‌ను ఖండించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంధ్య థియేటర్ ఘటన అద్దం పడుతుందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని మండిపడ్డారు. నటుడు అల్లు అర్జున్ అరెస్టుతో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సినీ పరిశ్రమపై గౌరవం లేదని రుజువైందని వైష్ణవ్ అన్నారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే కేంద్రమంత్రి స్పందించారు.
కేంద్రమంత్రి స్పందన:
సినిమా ప్రముఖులపై నిరంతరాయంగా దాడులు చేసే బదులు బాధితులకు సహాయం చేయాలని, ఆ రోజు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన వారిని శిక్షించాలని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కాలంలో ఇలాంటి వైఫల్యాలు ఆనవాయితీగా మారడం విచారకరం అని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. బెయిల్ పొందడానికి తన కేసును ఉపయోగించుకున్నందుకు అల్లు అర్జున్, అతని న్యాయ బృందాన్ని, బెయిల్ లభించినందుకు అల్లు అర్జున్‌ను అభినందించారు. సీఎం రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.
Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడమంతా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అందరి దృష్టిలో సీఎం రేవంత్ సూపర్ స్టార్ కావాలని చూస్తున్నారని, మొత్తానికి ప్లాప్ యాక్టర్‌గా నిలిచాడని అర్నాబ్ అన్నారు. అభిమానుల గుండెల్లో అల్లు అర్జున్ సూపర్ స్టార్‌గా నిలిచారని చెప్పారు. గతంలో తన విషయంలో కూడా ఇలాగే జరిగిందని అన్నారు. హిందూమతానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రపై మండిపడ్డారు. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ జాతర సన్నివేశాన్ని, హిందూ సంప్రదాయాలను కీర్తించిందని, కాంగ్రెస్ ఎప్పుడూ హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అర్నాబ్ అన్నారు. హిందూత్వ దృశ్యాలు, దేవాలయాలు, గంగమ్మ జాతరను హైలైట్ చేసే సెంటిమెంట్‌తో ఉత్తరాది సినీ ప్రేమికులు, ఉత్తరాది వ్యాప్తంగా ఉన్న ప్రజలు పుష్ప ది రూల్‌కి కనెక్ట్ అయ్యారని అన్నారు.
Also Read: ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం
Also Read: తిరుమలలో విషాదం..నడకదారిలో హైదరాబాద్ భక్తుడు మృతి!
Also Read: Rahul: నా మొదటి ప్రసంగం కంటే బాగుంది..ప్రియాంక స్పీచ్‌పై రాహుల్ స్పందన