Rahul: నా మొదటి ప్రసంగం కంటే బాగుంది..ప్రియాంక స్పీచ్‌పై రాహుల్ స్పందన

 వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈరోజు లోక్‌సభలో మొదటిసారిగా ప్రసంగించారు. దీనిపై ఆమె అన్న రాహుల్ గాంధీ స్పందిస్తూ..నా మొదటి స్పీచ్ కంటే చాలా బాగుంది అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. 

New Update
Rahul gandhi

ప్రియాంకాగాంధీ ప్రసంగంపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. సెషన్స్ తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన ఆయన దీని గురించి మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన ప్రసంగం.... నా తొలి ప్రసంగం కంటే గొప్పదిగా ఉంది అంటూ పొగిడారు. ఆమె సభలో ఏం మాట్లాడారో అవన్నీ చాలా వాలీడ్ పాయింట్లని మెచ్చుకున్నారు. ప్రియాంక ఇక మీదట కూడా తన గళాన్ని ఇలాగే వినిపిస్తారని ఆశిస్తున్నా అన్నారు రాహుల్ గాంధీ.  

లోక్‌సభలో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. మొదటి ప్రసంగంలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చలో ఆమె పాల్గొన్నారు. దేశానికి రాజ్యాంగం సురక్ష కవచం లాంటిందని.. దీన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పిస్తుంది. రాజ్యాంగాన్ని బద్ధలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్‌లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరి సరికాదు. కులగణన చేపట్టాలంటే గతంలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారు. మేము ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి ఎందుకు..ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ హయాం గురించి ప్రస్తావిస్తోంది. నెహ్రూ ఉన్నప్పుడు అదెందుకు జరగలేదు, ఇదెందుకు జరగలేదు అంటున్నారు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా, దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా ?'' అని ప్రియాంక గాంధీ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రతీ విషయానికి నెహ్రూ పేరు ఎత్తేవాళ్లు, దేశం కోసం ఏం చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 

Also Read: Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు