Tirumala: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వయసుతో తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. అప్పటి వరకు మనతో మాట్లాడిన వారే ఉన్నట్టుండి మన కళ్ల ముందే కూలిపోతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇలాగే గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు మరింత పెరగడం ఆందోళన కలిగస్తోంది. Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఈ క్రమంలోనే తాజాగా తిరుమల నడకమార్గంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఒకరు గుండెపోటుతో చనిపోయారు.స్నేహితులతో సరదా మాట్లాడుతూ.. తిరుమల నడక మార్గంలో వెళుతుండగా ఆయన హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు. Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా? హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన సీహెచ్ రవికుమార్ అనే యువకుడు ఐదుగురు స్నేహితులతో కలిసి.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరి వచ్చి.. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడకమార్గంలో పయనమయ్యారు. Also Read: Rahul: నా మొదటి ప్రసంగం కంటే బాగుంది..ప్రియాంక స్పీచ్‌పై రాహుల్ స్పందన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ 2,500 మెట్లు ఎక్కేశారు.. అయితే రవికుమార్ ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్నేహితులు ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వడంతో.. అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. బాధితుణ్ణి హుటాహుటిన తిరుమలలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ రవికుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు. Also Read: కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్య.. స్పందించిన విదేశాంగ శాఖ దీంతో రవికుమార్ మృతదేహాన్ని తిరుమల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతూ రవికుమార్ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.