గంటకు రూ.5 లక్షలు తీసుకున్న బన్నీ లాయర్.. మొత్తం ఎంత వసూల్ చేశాడంటే!

సంధ్య తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గంటకు రూ.5 లక్షలు తీసుకున్నారు. ఇతను కేవలం లాయర్ మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

author-image
By Kusuma
New Update
aa

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అరెస్టు అయిన అల్లు అర్జున్‌కి మధ్యంత బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా బన్నీ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ రావడంతో.. అసలు బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరని అతని గురించి చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి బెయిల్ బెయిల్ రావడంలో లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. గతంలో షారుక్ ఖాన్ కూడా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తొక్కిసలాట కేసులో అరెస్టు అయ్యారు. ఇదే విషయాన్ని లాయర్ నిరంజన్ ప్రస్తావించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!

గంటకి ఇన్ని లక్షలా?

తెలంగాణలో నిర్మల్‌కి చెందిన నిరంజన్ రెడ్డి గంటకు రూ.5 లక్షలు తీసుకున్నారు. కేవలం కోర్టులో రెండు గంటల పాటు వాదించి.. రూ.10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. నిరంజన్ రెడ్డి ఏదైనా కేసు టేకప్ చేశాడంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఇతను కేవలం లాయర్ మాత్రమే కాదు.. వైసీపీ ఎంపీ కూడా. ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు నిరంజన్ నిర్మాతగా వ్యవహరించారు.

నిరంజన్ తండ్రి విద్యా సాగర్ రెడ్డి కూడా లాయర్‌గా పనిచేశారు.1992లో పుణెలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో నిరంజన్ రెడ్డి లా చదివారు. ఓవైపు లాయర్ గా చేస్తూనే  తెలుగు సినిమాల్లోనూ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్యలాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, ఘాజీ హిట్టయినా.. వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి.

ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..

రాజకీయాల్లోనూ నిరంజన్ రెడ్డి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న నిరంజన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో వైయస్ జగన్ ఆయనను 2022లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే నిరంజన్ రెడ్డి నేపథ్యం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ మరోసారి బన్నీకి వైసీపీ సపోర్ట్ ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఇక పుష్ప రిలీజ్ నుంచి బన్నీకి వైసీపీ నేతలు మద్దతు పలుకుతూ వస్తున్నారు. 

 ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు