/rtv/media/media_files/2024/12/14/W2cjjI7aCy2X4OdYkbWr.jpg)
Bears
Bears: ఒక డబ్బాలో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి పిల్లను భారత సైన్యం రక్షించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలుగుబంటి పిల్లను విడిపించడానికి సైనికులు టూల్స్ ఉపయోగించి జాగ్రత్తగా పనిచేయడం వీడియోలో చూడవచ్చు. జంతువుకు ఎలాంటి హాని జరగకుండా దాన్ని రక్షించారు. మంచు పర్వతంపై టిన్ క్యాన్‌లో హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి పిల్ల తల ఇరుక్కోవడం అటుగా వెళ్తున్న భారత సైనికులు గుర్తించారు. వెంటనే దాన్ని టూల్స్ ఉపయోగించి రక్షించారు. Xలో ఒక వినియోగదారు షేర్ చేసిన 55-సెకన్ల క్లిప్ వైరల్‌గా మారింది.
సైనికుల అంకితభావాన్ని చూసి..
ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ తమ ఫార్వర్డ్ పోస్ట్‌కు సమీపంలో ఎక్కడో ఒక హిమాలయ ఎలుగుబంటిని రక్షించాయి అని వినియోగదారు ట్వీట్‌లో రాశాడు. అసలే హిమాలయాల్లో విధులు నిర్వహించడం అత్యంత సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వన్యప్రాణులను రక్షించడంలో సైనికుల అంకితభావాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు సైనికులను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్య వారి ధైర్యసాహసాలకు, మానవత్వానికి నిదర్శనమని కొనియాడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ సమస్యలు ఉంటే నిమ్మకాయ నీళ్లు తాగొద్దు
Indian army troops rescuing a Himalayan bear somewhere near their forward post🙌 pic.twitter.com/nntLEnn0se
— KiloMike2🇮🇳 (@TacticalKafir) November 24, 2024
అయితే హిమాలయ పర్వతాలలో ఇలాంటి టిన్ డబ్బాలు వేయడంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణంపై ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలని, ఇలాంటి ప్రదేశాల్లో చెత్త వేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే సైనికులు ఆ ఎలుగు బంటికి మంచి పేరు పెట్టారు. దాని తల మెటల్ కంటై నర్‌లో చిక్కుకున్నందున ఆప్యాయంగా బహదూర్ అని పేరు పెట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెస్క్యూ జరిగిన ప్రదేశం ఎక్కడ అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఫుటేజ్‌లో సైనికులు ఎత్తైన సరిహద్దు వాతావరణంలో ఉండటం చూడవచ్చు.
ఇది కూడా చదవండి: వామ్మో.. 9 నెలల గర్భంతో భరతనాట్యం