/rtv/media/media_files/2025/11/15/kcr-2025-11-15-12-01-48.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubilee hills by‑elections)ల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్(BRS Party) నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (khairatabad), కడియం శ్రీహరి (station-ghanpur)లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది.
Also Read : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ కు TDP సైలెంట్ సపోర్ట్!
స్పీకర్ వేటు వేసే అవకాశం
ఇక కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరంగంగా అంగీకరించారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో వీరికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని 24 వేలకు పైగా మెజార్టీతో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటుగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
తాజాగా, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై స్పీకర్ వేటు వేయడం, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్‌గా మారింది. గతంలో స్పీకర్లు ఫిరాయింపు కేసులను సాగదీసినప్పటికీ, ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా స్పీకర్లు వేగంగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : శత్రువులు ఎక్కడో ఉండర్రా..? కూతుళ్లు, చెల్లెళ్లుగా..కవిత ట్వీట్ కు BRS కౌంటర్!
Follow Us