/rtv/media/media_files/2025/11/15/tdp-2025-11-15-11-22-22.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubliee hills by election)ల్లో కాంగ్రెస్(congress) అభ్యర్థి సాధించిన విజయం కేవలం ఆ పార్టీ బలం మాత్రమే కాదని, తెరవెనుక జరిగిన రాజకీయ వ్యూహాలు, కీలక సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ విజయంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్ మద్దతుతో పాటుగా, కమ్మ సామాజిక వర్గం ఏకపక్ష ఓటింగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది.
అయితే ఈ ఉప ఎన్నికలో టీడీపీ(tdp) కానీ, దాని మిత్రపక్షమైన జనసేన కానీ నేరుగా పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినాయకత్వం తమ మద్దతుదారులను పరోక్షంగా కాంగ్రెస్ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆ వర్గం దాదాపుగా ఏకపక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్లు సమాచారం.
Also Read : TTD మాజీ విజిలెన్స్ అధికారి మృతి కేసులో బిగ్ ట్విస్ట్
నవీన్ యాదవ్‌కు మజ్లిస్ మద్దతు
ఈ నియోజకవర్గం ఫిల్మ్ నగర్ పరిధిలో ఉండటం వల్ల, సినిమా రంగానికి చెందిన కార్మికులు, సెలబ్రిటీల ఓట్లు గణనీయంగా ఉంటాయి. వారి ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒకప్పుడు ఆ పార్టీలో కీలక నేత. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కు ఓట్ షిప్ట్ కావడంలో కీ రోల్ పోషించాయని తాజా ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఇక నవీన్ యాదవ్‌కు మజ్లిస్ మద్దతు కూడా చాలా కలిసొచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. దాదాపుగా అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 48.49% పోలింగ్ శాతం నమోదైంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించి, డిపాజిట్ కోల్పోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక వచ్చింది.
Also Read : శత్రువులు ఎక్కడో ఉండర్రా..? కూతుళ్లు, చెల్లెళ్లుగా..కవిత ట్వీట్ కు BRS కౌంటర్!
Follow Us