Kavitha: శత్రువులు ఎక్కడో ఉండర్రా..? కూతుళ్లు, చెల్లెళ్లుగా..కవిత ట్వీట్ కు BRS కౌంటర్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.  ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.

New Update
Kavitha

Kavitha

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(jubilee hills by election) లో బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.  ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో కవిత ఇన్‌డైరెక్ట్‌గా BRS పార్టీ(BRS Party) పైనే ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  అయితే ఆమె ట్వీట్ పై బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆమెకు బీభత్సంగా  కౌంటర్ ఇస్తున్నారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా! ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లు,చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు అంటూ ఆమె ట్వీట్ కు కౌంటర్ ఇస్తున్నారు.  ఇది ఎమోషనల్ డ్యామేజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read :  రాజకీయంగా నిలబడడానికి 40 ఏళ్లు పట్టింది.. నవీన్‌ యాదవ్‌ బావోద్వేగం

నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.  దివంగత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీఎం  రేవంత్ రెడ్డి నాయకత్వానికి రెఫరెండంగా భావించింది. విజయం సాధించడం ద్వారా సీఎం నాయకత్వానికి, ప్రభుత్వ పనితీరుకు ప్రజల మద్దతు లభించినట్లు కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించాయి. 

Also Read :  కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో అభ్యర్థి మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఫలితం అనుకూలంగా రాలేదు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి, డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. జూబ్లీహిల్స్ గెలుపుతో, తెలంగాణ 119 స్థానాల అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం 66కి పెరిగింది. ఈ ఫలితం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుంది.

Advertisment
తాజా కథనాలు