TPCC Mahesh Kumar: TPCC సంచలన వ్యాఖ్యలు.. ‘క్రమశిక్షణ కమిటీకి చేరిన రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం’

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పదువులు, పైసలు మీకేనా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన దృష్టికి వచ్చాయని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

New Update
MAHESH GOUD TPCC

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy-raj-gopal-reddy) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆయన వ్యవహారాన్ని అప్పగించామని, ఈ విషయంలో కమిటీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై, పార్టీ నాయకత్వంపై పదేపదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి డిటిటల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను కూడా రాజ్ గోపాల్ రెడ్డి ఖండించారు. అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అలకబూనారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తిని మరోసారి వెల్లగక్కారు.

Also Read :  వీడు వార్డెన్ కాదు వేస్ట్ ఫెలో.. హైదరాబాద్‌లో బయటపడ్డ దారుణం!

TPCC Mahesh Kumar Says Disciplinary Committee

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, "ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలి. ఆయన వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీకి నివేదించాము. కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుంది" అని తెలిపారు. పార్టీలో అందరికీ పదవులు, డబ్బులు కావాలా అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. పార్టీ నాయకులపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని మహేష్ గౌడ్ అన్నారు.

Also Read :  ఆ 9 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ప్రభుత్వ నిధుల కేటాయింపులపై కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, అదే సమయంలో ముఖ్యమంత్రి నియోజకవర్గానికి, ఇతర కీలక నాయకుల నియోజకవర్గాలకు నిధులు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, కొత్త పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వెల్లగక్కారు. తాను స్వయంగా మంత్రిని సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు.

అయితే, ఈ విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, "రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నాయా లేదా అనేది క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. పార్టీలో ఇటువంటి విమర్శలకు తావులేదు. పార్టీ క్రమశిక్షణను పాటించడం అందరి బాధ్యత" అని అన్నారు. మంత్రి పదవి లభించకపోవడం పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం టీపీసీసీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు