/rtv/media/media_files/2025/07/19/toddy-shops-inside-orr-are-closed-2025-07-19-16-40-51.jpg)
Toddy shops are closed inside ORR
TODDY shops : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీకల్లు ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కల్తీకల్లు తాగి సుమారు 60 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో పదిమంది మరణించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో కల్లీకల్లు విక్రయాల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డు లోపల కల్లు విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సాధ్యసాధ్యాలపై ఎక్సైజ్‌శాఖ నుంచి ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
కల్తీ కల్లు ఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ఓఆర్‌ఆర్ పరిధిలో కల్లు దుఖాణాల పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో పూర్తిస్థాయిలో, సరూర్‌నగర్, శంషాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో పాక్షికంగా కల్లు దుకాణాలను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక వేళ అలా చేస్తే జంట నగరాల్లో ఆరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 21 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో బాడీ కో ఆపరేటివ్ సొసైటీ, టీసీఎస్‌ల కింద ఉన్న కల్లు దుకాణాలతో పాటు ఓఆర్ఆర్ లోపల టీ ఫర్ ట్రేడ్ కింద ఉన్న దుకాణాలన్నీ మూతపడే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
ఒకప్పుడు హైదరాబాద్ లో తాటిచెట్లు ఉన్నకాలంలో కల్లుదుఖాణాలు విరివిగా నడిచాయి. అయితే ఆ తర్వాత నగరం విస్తరించడం, జనాభా పెరగడంతో తాటి,ఈత చెట్లు లేకుండా పోయాయి. దీంతో కల్తీ కల్లు విక్రయాలు పెరిగాయి. 2004 సమయంలో కల్తీ కల్లు ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం కల్లు దుకాణాల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో దుకాణాలు మూత పడ్డాయి. అయితే తెలంగాణ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ఈ దుకాణాలకు లైసెన్స్‌లను పునరుద్ధరించింది. నగరం చుట్టూ పక్కల ఉన్న ప్రాంతాలనుంచి తాటి, ఈత వనాల నుంచి కల్లును సేకరించి నగరంలో విక్రయించడం ద్వారా కల్లు వృత్తిదారులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో కల్లు దుకాణాలకు అనుమతినిచ్చారు. అయితే. తాటి, ఈతచెట్లు సరిపడా అందుబాటులో లేక సింథటిక్ కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కల్లులో మత్తు కోసం అల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ లాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కల్లులో కల్తీ పెరిగింది.
ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!
ఈ కల్లు తాగిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ, ఎక్సైజ్ శాఖ వీటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో ఇటీవల కల్తీకల్లు కాటుకు పదిమంది ప్రాణాలు గాలిలో కలిశాయి. కాగా హైదరాబాద్ పరిధిలో బాడీ కోఆపరేటివ్ సొసైటీ టీసీఎస్‌లు 14 వరకు ఉండగా వాటి పరిధిలో 53 కల్లు దుకాణాలున్నాయి. సికింద్రాబాద్ పరిధిలో టీసీఎస్‌లు 31 ఉండగా వాటి పరిధిలో 50 కల్లు దుకాణాలున్నాయి. ఇలా మొత్తం టీసీఎస్‌లు 390 ఉంటే, కల్లు దుకాణాలు 454 వరకు ఉన్నాయి. అయితే మొన్నటి కూకట్ పల్లి ఘటనతో ఈ దుకాణాలన్నీ మూతపడే అవకాశం ఉంది. అయితే వీరి ఉపాధి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనేది తెలియాల్సి ఉంది.
మందుబాబులతో ఫరేషాన్...
ఓఆర్‌ఆర్ పరిధిలో కల్లు దుకాణాలు మూసివేయాలన్న ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ మందు బాబుల అరోగ్యం విషయంలోనూ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ కల్తీకల్లు తాగిన వారు పలుమార్లు అస్వస్థతకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిషేధిత ఉత్ప్రేరకాలైన అల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ వాటిని వాడటం వల్ల ఈ కల్లు తాగిన వారి బ్రెయిన్ పై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ఈ కల్లుకు అలవాటు పడిన వారు ప్రతిరోజు తప్పకుండా తాగాల్సిన పరిస్థితి. కరోనా సమయంలో కల్లు దుకాణాలు మూతపడగా అనేక మంది అస్వస్థతకు గురికావడం, పిచ్చిపట్టినవారిలా ప్రవర్తించడం వంటి సంఘటనలు తలెత్తాయి.అయితే అటువంటివారిని ఆ మత్తు నుంచి బయటపడేసేందుకు డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వారిని మత్తు నుంచి బయటపడేందుకు దోహదం చేయాలి. ఒకవేళ కల్లుదుకాణాలు మూసివేస్తే తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి సెంటర్ ల సంఖ్యను పెంచడం ద్వారా మందుబాబుల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!
toddy compounds | toddy worker | outer-ring-road | Keesara Outer Ring Road | narsingi-outer-ring-road | kukatpally