/rtv/media/media_files/2025/05/19/H78Rl5fjRUpurh9g4cTG.jpg)
Vizianagaram conspiracy case
Vizianagaram Terror case : హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నిన కేసులో విజయనగరంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా బాంబులు తయారు చేయడానికి ఆమేజాన్ లో టిఫిన్ బాక్స్ లు ఆర్డర్ చేయగా, తయారు చేసిన బాంబులను రంపచోడవరం అడవుల్లో పరీక్షించినట్లు దర్యాప్తులో తేలింది.కాగా సౌది కేంద్రంగా వచ్చే ఆదేశాలను సిరాజ్, సమీర్ అమలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు, పోలీసులు గుర్తించారు. అంతేకాదు వారు తయారు చేసిన బాంబులు పని చేస్తున్నాయా లేవా అని తెలుసుకోవడానికి రంపచోడవరం అటవీ ప్రాంతంలో సిరాజ్ రిహార్సల్‌సైతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఉగ్ర కుట్రను ఎలా అమలు చేయాలనే విషయాలను తెలుసుకునేందుకు సిరాజ్ మూడుసార్లు సౌదీ వెళ్లినట్లు గుర్తించారు.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
కాగా బాంబుల తయారీకి టిఫిన్ బాక్స్‌లు ఉపయోగించాలనుకున్నారని, వాటిద్వారా టిఫిన్ బాక్స్ బాంబ్‌లు తయారు చేయాలని సిరాజ్, సమీర్‌కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. హైదరాబాద్ పేలుళ్ల కుట్రలో ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని. వీరిలో సిరాజ్, సమీర్‌తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు తేలింది. ఇక హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఆరుగురు హైదరాబాద్ కు వచ్చి మూడు రోజులు గడిపినట్లు తెలిసింది. వారిలో ఇద్దరు బాంబులు తయారు చేస్తే , నలుగురు బాంబులు పెట్టే ప్రాంతాలను గుర్తించాలని సౌదీ నుంచి వారికి ఆదేశాలు వచ్చినట్లు దర్యా్ప్తు సంస్థలు గుర్తించాయి.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
సిరాజ్ అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు సిరాజ్, సమీర్ లకు 14రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను సీజ్ చేశారు. కాగా ఐసిస్ ఉగ్రవాదులతో వీళ్లకున్న సంబంధాలు ఏంటి ? మరో నలుగురు ఎవరు? సౌదీ నుంచి వీరికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలని టార్గెట్‌లు పెట్టుకున్నారనే విషయాలు వెలుగు చూడాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
బోయిగూడలో ఉంటున్న సమీర్ ను అరెస్ట్ చేసిన సమయంలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. సమీర్ తమతో ఎప్పుడూ గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. వెంటనే అతన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అతను పాతబస్తీకి చెందిన వారిని ఎక్కువగా కలిసేవాడని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు కుట్రపన్నాడని స్థానికులు ఆరోపించడం గమనార్హం.
Also Read: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!