CP Sajjanar: మా డాడీ ఎవరో తెలుసా? అంటే కుదరదు.. మందుబాబులకు CP సజ్జనార్ వార్నింగ్!

న్యూఈయర్ సెలబ్రేషన్స్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపే 'మందుబాబులకు' హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీల పేరుతో హద్దులు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని, జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.

New Update
CP Sajjanar

CP Sajjanar

న్యూఈయర్ సెలబ్రేషన్స్ వేళ సిటీలో మద్యం సేవించి వాహనాలు నడిపే 'మందుబాబులకు' హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(hyderabad new CP sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీల పేరుతో హద్దులు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని, వేడుకలు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా(Social Media) వేదికగా ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read :  నీళ్లనుకుని కెమికల్ ఇచ్చిన తల్లి.. కొడుకు మృతి

మందుబాబులకు సజ్జనార్ 'స్వీట్' వార్నింగ్

నగర వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్(drunk-and-drive) తనిఖీలు నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ అయిపోయాక మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకుంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. "మద్యం సేవించిన తర్వాత ఇంటికి వెళ్లడానికి క్యాబ్ ఎక్కుతారా లేక కేసులతో కోర్టు మెట్లు ఎక్కుతారా?" అని ప్రశ్నించారు. పోలీసులకు పట్టుబడ్డాక లాయర్‌ని వెతకడం కంటే, అంతకుముందే గూగుల్‌లో క్యాబ్‌ను వెతకడం చాలా మంచిదని సజ్జనార్   చెప్పుకొచ్చాయి. "డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు ఓ నమస్కారం పెట్టి దూరంగా ఉండు.. వెంటనే క్యాబ్ ఎక్కి సురక్షితంగా ఇల్లు చేరుకో" అంటూ ఫ్రెండ్లీ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ. 

Also Read :  సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది

మా డాడీ ఎవరో తెలుసా?" అంటే కుదరదు!

సాధారణంగా తనిఖీల్లో పట్టుబడినప్పుడు కొందరు యువకులు తమకున్న పరపతిని ఉపయోగిస్తూ "మా డాడీ ఎవరో తెలుసా?", "మా అంకుల్ ఎవరో తెలుసా?" అని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటారు. దీనిపై సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు.

"మా డాడీ ఎవరో తెలుసా అంటే ఇకపై కుదరదు. మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం. మీ వివరాలు ఏవైనా ఉంటే కోర్టులోనే చెప్పుకోండి. చట్టం ముందు అందరూ సమానమే" అని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఈ క్రింది చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

భారీ జరిమానా: రూ. 10,000 వరకు జరిమానా.
జైలు శిక్ష: ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం.
లైసెన్స్ రద్దు: నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు.
వాహనాల సీజ్: పట్టుబడిన వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.

హైదరాబాద్‌లో 100కు పైగా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, సుమారు 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. కాబట్టి యువత, మందుబాబులు బాధ్యతాయుతంగా వ్యవహరించి 2026కు సురక్షితంగా స్వాగతం పలకాలని ఆయన కోరారు.

Advertisment
తాజా కథనాలు